రిటైర్డ్ ఉద్యోగులకు 3 నెలల్లో బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు వారి పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపులో ఆలస్యం జరగకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది.

రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలల్లో బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకు వారి పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపులో ఆలస్యం జరగకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేసు వివరాలు

ఈ కేసు WP No. 4850 of 2026గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చింది. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీ ఫండ్ మరియు ఇతర బకాయిలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోందని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కీలక ఆదేశం

గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ డి. రమేష్ గారు ఈ కేసును విచారించి, ప్రభుత్వాన్ని ఈ విధంగా ఆదేశించారు:

  • రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన అన్ని బెనిఫిట్స్‌ను 3 నెలల లోపు చెల్లించాలి.
  • ఈ గడువు కోర్టు ఉత్తర్వుల కాపీ అందుకున్న తేదీ నుండి అమల్లోకి వస్తుంది.
  • పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్, జీపీ ఫండ్ మరియు PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

కోర్టు వ్యాఖ్యలు

కోర్టు గమనించిన ప్రకారం, పిటిషనర్లు తమ సేవలను పూర్తిచేసి రిటైర్ అయినప్పటికీ, వారికి రావలసిన బెనిఫిట్స్ విడుదలలో ఆలస్యం జరగడం అన్యాయమని పేర్కొంది.

ఇప్పటికే బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపినప్పటికీ చెల్లింపులు జరగకపోవడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది.

Official Court Order

పూర్తి హైకోర్టు ఉత్తర్వులను క్రింది PDFలో చూడవచ్చు.

Court Order PDF

Download Now