SSC 2026 పరీక్షలకు విద్యార్థులకు DGE-BSEAP డైరెక్టర్ సందేశం

2026 పదో తరగతి (SSC)పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (DGE-BSEAP) డైరెక్టర్ గారు ఇచ్చిన అమూల్యమైన సందేశం:

2026 పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు DGE-BSEAP డైరెక్టర్ సందేశం

Published: 16 March 2026

2026 పదో తరగతి (SSC)పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (DGE-BSEAP) డైరెక్టర్ గారు ఇచ్చిన అమూల్యమైన సందేశం:

ప్రియమైన విద్యార్థులారా,

మీరు గత పదేళ్లుగా సాగించిన విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నారు. ఈ పరీక్షలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీలోని సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు:

  • మీపై మీకు నమ్మకం ఉండాలి: లోకంలో అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మాల్సింది మీరే. "నేను చదవగలను, నేను వ్రాయగలను, నేను సాధించగలను" అనే ధీమాతో పరీక్ష హాలులోకి అడుగు పెట్టండి.
  • ఒత్తిడిని జయించండి: పరీక్ష అనేది మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. ప్రశాంతమైన మనస్సుతో వ్రాసే సమాధానాలే మీకు ఎక్కువ మార్కులు తెచ్చిపెడతాయి.
  • సమయపాలన: అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మీకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించండి.
  • ముఖ్యమైన అంశాలు: ముఖ్యమైన పాయింట్లు, సూత్రాలు, మరియు తేదీలను ఒక దగ్గర వ్రాసి పెట్టుకుంటే చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
  • కష్టానికి తగిన ప్రతిఫలం: మీరు పడిన ప్రతి గంట కష్టం, మీరు చదివిన ప్రతి అక్షరం వృధా పోదు. మీ శ్రమ కచ్చితంగా విజయ రూపంలో మీ ముందుకు వస్తుంది.
  • తల్లిదండ్రుల కల: మీ విజయం కోసం ఎదురుచూస్తున్న మీ తల్లిదండ్రుల కళ్ళలోని ఆనందాన్ని ఒక్కసారి తలచుకోండి. ఆ ఆలోచనే మీకు రెట్టింపు శక్తిని ఇస్తుంది.

పరీక్షలకు సంబంధించి అధికారిక కీలక వివరాలు

  • పరీక్షల తేదీలు : 16 March 2026 నుండి 01 April 2026 వరకు
  • పరీక్షా సమయము : 09:30 AM to 12:45 PM (Students to report by 08:30 AM; No entry after 10:00 AM).
  • హాల్ టికెట్స్ వివరాలు : Released on 05/03/2026 Via… www.bse.ap.gov.in, school login, and WhatsApp Governance (Mana Mithra – 95523 00009). LEAP app
  • పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు: 6,40,916 (Regular: 6,22,074; Private: 18,842).
  • Total Number of Boys: 3,28,652
  • Total Number of Girls: 3,12,264
  • మొత్తము పరీక్షా కేంద్రాలు: 3,415 (A Category:1,522; B Category:1,271; C Category: 622).
  • Total Number of CS appointed: 3,415
  • Total Number of DO appointed: 3,415
  • Total Number of Invigilators appointed: 38,958.
  • 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించటం జరిగింది. ఈ కేంద్రాలను CCTV surveillance లో ఉంచటం జరిగింది.
  • మాల్ ప్రాక్టీస్ ను నివారించటానికి 156 Flying Squads ఏర్పాటు చేయటం జరిగింది.
  • Health Department వారి సహకారముతో ప్రత్యేక Medical Teams ఏర్పాటు చేయటం జరిగింది.
  • అన్ని పరీక్షా కేంద్రాల వద్ద first-aid kits సౌకర్యముతో ANM లను నియమించాము.
  • అన్ని పరీక్షా కేంద్రాల వద్ద Drinking water, seating, ventilation, and furniture వంటి సౌకర్యాలు కల్పించటం జరిగింది.
  • ముఖ్యముగా పరీక్షా సమయములో విద్యుత్ సరఫరాకు సంబంధించి (24×7 power supply) విద్యుత్ శాఖ వారి సహాయ సహకారాలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరిగింది.
  • విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఉదయం 8.30 కు ముందుగానే పరీక్షా హాలుకు చేరుకునే విధముగా APSRTC వారి సహకారముతో ఉచిత బస్ రవాణా సౌకర్యము ఏర్పాటు చేయటం జరిగింది. కానీ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించవలసి ఉంటుంది.
  • పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు భంగం కలుగకుండా The Director General of Police వారి సహకారముతో law and order పర్యవేక్షణ చేయటం జరుగుతుంది.

పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయములో ప్రతీ విద్యార్థి శ్రద్ధ వహించాల్సిన అంశాలు

చేయదగిన అంశాలు:

  • 100 days Action plan & Model Papers ఉపయోగించాలి.
  • ప్రణాళిక బద్ధంగా చదవాలి మరియు రివిజన్ చేయాలి.
  • ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు తగిన నిద్ర తీసుకోవాలి.

చేయకూడని అంశాలు:

  • Mobile, TV & Social Media దూరంగా ఉంచాలి.
  • ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
  • బట్టీ పట్టడం మానండి.
  • వివాదాలకు దూరంగా ఉండండి.

తల్లిదండ్రులకు సూచనలు

  • పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు.
  • "మేము నీకు తోడున్నాము" అనే భరోసా ఇవ్వాలి.
  • ఇంట్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి.

విద్యార్థి ప్రతిభకు తల్లిదండ్రుల నమ్మకం తోడైతే, విజయం వారి సొంతమవుతుంది.