డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులు – EHS కార్డు అప్లికేషన్ విధానం

డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులకు అప్లై చేసుకునే విధానం:

డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులు – EHS కార్డు అప్లికేషన్ విధానం

  • అభ్యర్థి తన ఆధార్, అపాయింట్మెంట్ ఆర్డర్, మొదటి నెల పేస్లిప్ మరియు ట్రస్ట్ CEO వారికి నూతన కార్డ్ కొరకు డిడిఓ కవరింగ్ లెటర్ (కవరింగ్ లెటర్ నందు అభ్యర్థి యొక్క ట్రెజరీ ఐడి నెంబర్, ఫోన్ నెంబర్ ని తప్పనిసరిగా పేర్కొనాలి) లను విజిబుల్ గా స్కాన్ చేసి ap_ehf@drntrvaidyaseva.ap.gov.in అనే మెయిల్ కు అభ్యర్థి యొక్క వ్యక్తిగత మెయిల్ నుండి అభ్యర్థన పంపాలి.
  • సుమారు 5-6 రోజుల తర్వాత ఈహెచ్ఎస్ నుండి అభ్యర్థి మెయిల్ కు EHS లాగిన్ సంబంధించి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అందించబడతాయి.
  • తదుపరి ఈహెచ్ఎస్ వెబ్సైట్ https://www.ehs.ap.gov.in నందు సదర్ యూజర్ ఐడి పాస్వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి.
  • లాగిన్ తర్వాత Registrations → Initiate Health Card మీద క్లిక్ చేసి అందలి అన్నీ అంశాలు పూరించి, సంబంధిత డాక్యుమెంట్స్ ఫోటో, పే స్లిప్, ఆధార్, SSC డాక్యుమెంట్ లను జతపర్చి సబ్మిట్ చేయాలి.
  • సదరు అప్లికేషన్ సంబంధిత డి డి ఓ గారి EHS లాగిన్ కి వెళుతుంది. దానిని డిడిఓ గారు పరిశీలించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత అప్రూవ్ చేస్తే కార్డు జెనరేట్ అవుతుంది.
  • తదుపరి ఉద్యోగి ఆధారితులను ఎంటర్ చేసుకునేందుకు Registrations → Initiate New Beneficiaries అనే టాబ్ పై క్లిక్ చేసి వారి వివరాలు మరియు డాక్యుమెంట్లను జతపరిచి సబ్మిట్ చేయాలి. డి డి ఓ గారు అప్రూవల్ తరువాత వారి కార్డులు కూడా జనరేట్ అవుతాయి.
www.ehs.ap.gov.in